విజయనగరం పార్లమెంట్
రణస్థలంలో ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఇ ఆర్ క్యాంప్ కార్యాలయం లో జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఎన్నో సేవలను ఆదర్శంగా తీసుకొని ఎన్ ఇ ఆర్ స్కూల్, మహాలక్ష్మి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి రక్తం దానం చేసి స్ఫూర్తినిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లో రక్తదానం శ్రేష్టమైనది. ఒక మనిషి ఇచ్చే రక్తం ముగ్గురు ప్రాణాలు కాపాడుతుంది.
కుల,మత బేధాలను దృష్టించక రక్తదానం చేయండి. ఒకరి దానం మరొకరి ప్రాణం మనం ఇచ్చే రక్తం వేరొకరి జీవితం కాపాడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా SP , శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారులు, DMHO , రెడ్ క్రాస్ చైర్మన్, జిల్లా డాక్టర్ల బృందం, జిల్లా ముఖ్య అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు* అభిమానులు పాల్గొన్నారు.