ఈ నెల 21వ తేదీన పార్వతీపురం శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధికల్పనలో భాగంగా పదో తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ,ఎం.బి.ఎ చదువుకుని 18 నుండి 30 ఏళ్ల వయసున్న నిరుద్యోగ యువతీ యువకులు 21న సోమవారం ఉదయం 9.00 గం.ల నుంచి *శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కలాశాలలో నిర్వహించే జాబ్ మేళాకు హాజరు కావచ్చన్నారు. ఈ జాబ్ మేళాలో 18 కంపెనీల ప్రతినిధులు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను వారి కంపెనీలో ఎంపిక చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. కావున ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు తమ వివరాలను https://skilluniverse.apssdc.in వెబ్ సైట్ నందు తప్పనిసరిగా నమోదు చేసుకొని, రిఫరెన్స్ నెంబర్ తో పాటు బయో డేటా,ఆదార్ కార్డు, విద్యార్హత సర్టిఫికేట్లు ఒరిజినల్, జెరాక్స్, ఒక పాస్ ఫోటోతో హాజరు కావలసినదిగా ప్రకటనలో కోరారు. మరిన్ని వివరములకు 6305110947, 8978878557 నందు సంప్రదించాలని కోరారు.