పట్టణంలోని తొమ్మిదో వార్డు మహంతి వీధి, వేద సమాజం, ముత్రాసువీధిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వార్డు ప్రెసిడెంట్ గొర్లె తిరుమలరావు, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. గడువు ముగిసేలోగా సభ్యత్వ నమోదు లక్ష్యాలను పూర్తి చేస్తాం అని వార్డు ప్రెసిడెంట్ తిరుమలరావు అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.