రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టిటిడి లడ్డు ప్రసాదం కల్తీ విషయంపై నిర్వహిస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా మెంటాడ మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెంటాడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే దిశగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టే దీక్ష లోసంఘీభావం తెలిపారు. .అనంతరం జనసేన నాయకలు సబ్బవరపు రాజశేఖర్ గారుమీడియా తో మాట్లాడారు. ఈ కార్యక్రమం లో జనసేన సీనియర్ నాయకులు మండల సురేష్ , కూనిబిల్లి త్రినాధ , పొట్టా శేఖర్ , పాండ్రంకి శ్రీనివాస్ , గుడిసి కిరణ్ , సనాపతి శివాజీ , బొడ్డు శంకర్ , డీజే శివాజీ , కపినాయుడు , బొత్స తిరుపతి , వెంకటరమణ జనసైనికులు పాల్గొన్నారు.