జాతిపిత గాంధీజీ, నిజాయితీకి నిలువెత్తు రూపం లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
సత్యం, అహింస ఆయుధాలుగా భారత దేశపు స్వేచ్ఛా స్వాతంత్ర్య సమరాన్ని ముందుండి నడిపిన జాతిపిత గాంధీజీ స్వరాజ్యం సాధించిన బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయడమే మన కర్తవ్యం కావాలి అన్నారు. సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి అన్నారు. నిజాయితీకి నిలువెత్తు రూపం, నిబద్ధత కలిగిన రాజకీయ నేత లాల్ బహదూర్ శాస్త్రి స్వాతంత్ర సమరయోధుడిగా, ప్రధానిగా దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం అన్నారు.