జిల్లా కలెక్టర్ అధికారులకు మంత్రి సూచనలు
బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావం ఉత్తరాంధ్రపై ఎక్కువగా ఉంది.. కాబట్టి, జిల్లాలో ప్రజలు సురక్షితంగా ఉండేలా చర్యలు చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జిల్లా కలెక్టర్, అధికారులకు ఆదేశించారు. బుధవారం ఆమె విజయవాడ నుంచి విజయనగరం, మన్యం జిల్లా కలెక్టర్ల తో ఫోన్లో మాట్లాడి జాగ్రత్తలు తీసుకుని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్ధులు, రైతులు, వేటకు వెళ్లే మత్స్యకారులు తగు జాగ్రత్త వహించాలని మంత్రి సంధ్యారాణి కోరారు.