సాలూరు మండలం ఖరాసవలస పంచాయితీ దత్తివలస గ్రామ అంగన్వాడీ టీచర్ బొమ్మి బంగారమ్మ గుండెపోటుకు గురై మృతి చెందిన విషయం తెలుసుకున్న స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖా మంత్రి సంధ్యారాణి మృతురాలు ఇంటికీ వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.