ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా అన్నిపోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత తెలిపారు. సచివాలయంలో శుక్రవారం అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.త్వరలో జరగబోయే మెగాడీఎస్సీకి సంబంధించి 26 జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.