చిన్నారి, తల్లిదండ్రులకు అభినంచి సన్మానించిన మంత్రి సంధ్యారాణి
ఈనెల 14న కీపర్స్ ఆఫ్ ది నోబెల్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న 6 నెలల చిన్నారి సిరికి ధన్సికను, పాప తల్లితండ్రులను మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి అభినందించి సత్కరించారు. బొబ్బిలికి చెందిన సిరికి లక్ష్మణరావు, హారిక దంపతుల కుమార్తె ధన్సిక 120 చిత్రాలతో జంతువులు 27, కూరగాయలు 27, పండ్లు 212 ఫోటోగ్రాఫిక్ కార్డులను గుర్తించినందుకు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానం కల్పించారు. అతి చిన్న వయసులోనే సూపర్ మెమరీతో అధ్బుతం సృష్టించిన చిన్నారిని మంత్రి అభినందించారు అంతేకాకుండా తల్లిదండ్రులను సత్కరించారు.