దేవాన్ష్ కి మంత్రి సంధ్యారాణి అభినందనలు

చెస్‌లో చంద్రబాబు మనవడు దేవాన్ష్ ప్రపంచ రికార్డ్‌..

ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్‌ తనయుడు దేవాన్ష్ చదరంగంలో ప్రపంచ రికార్డ్‌ సృష్టించాడు. వేగంగా పావులు కదపడంలో  రికార్డు నెలకొల్పిన‌ దేవాన్ష్ ను మహిళ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అభినందించారు.

9 ఏళ్ల దేవాన్ష్ ”వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్” ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.

దేవాన్ష్ లేజర్‌ షార్ప్‌ ఫోకస్‌తో శిక్షణ పొందడం ప్రత్యక్షంగా చూశానని, ఈ ఘనత పట్ల నారా లోకేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. ”దేవాంశ్‌ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించాడు. గ్లోబల్‌ అరేనాలో భారతీయ చెస్‌ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాడు. ఈ ఈవెంట్‌ కోసం గత కొన్ని వారాలుగా రోజుకు 5..6 గంటలు శిక్షణ పొందాడు. చెస్‌ పాఠాలు నేర్పిన రాయ్‌ చెస్‌ అకాడమీకి ధన్యవాదాలు” అని లోకేశ్‌ తెలిపారు..

దేవాన్ష్ సృజనాత్మకంగా చెస్‌ నేర్చుకునే ఒక డైనమిక్‌ విద్యార్థి అని కోచ్‌ కె.రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. 175 సంక్లిష్టమైన ఫజిల్స్‌ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన మానసిక చురుకుదనం అతని సొంతమన్నారు. దేవాంశ్‌ చదరంగ ప్రయాణంలో ఇదొక మైలురాయి అని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *