పట్టణంలోని శివాలయం రోడ్లో దుర్గాదేవి ఆలయం సమీపాన అయ్యప్ప భక్తుల భోజనశాల నిర్మాణ పనులకు మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మంగళవారం భూమి పూజ చేశారు. దాతల సహకారంతో భవన నిర్మాణం చేపడుతున్నట్లు అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు నిమ్మాది చిట్టి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.