అమరావతి సచివాలయంలో గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రాష్ట్రంలో పలు జిల్లాలు, పట్టణాల ప్రజల నుంచి వచ్చిన పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. గిరిజన, మహిళ శిశు సంక్షేమ శాఖ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని గిరిజన సంఘాల ప్రతినిధులు మంత్రి సంధ్యారాణికి పుష్పగుచ్చాలు అందించి సత్కరించారు. సచివాలయంలో స్వీకరించిన సమస్యలను శాఖల వారీగా విభజించి ఆయా అధికారులతో మాట్లాడి తక్షణమే వీటిని పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.