అమరావతిలో కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడును మంత్రి సంధ్యారాణి మర్యాద పూర్వకంగా కలిశారు. విశాఖపట్నంకు విమానం సర్వీసులు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళ్లే విమానం సాయంత్రం 6:30 గంటలకి, విజయవాడ నుంచి విశాఖపట్నంకు ఉదయం 8:30 గంటలకి ఒక్క విమాన సర్వీస్ మాత్రమే ఉండేది. దానివలన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని గతంలో సంధ్యారాణి తెలియజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించి ఉదయం రెండు సాయంత్రం రెండు విమాన సర్వీసులు ఏర్పాటు చేశారు. సర్వీసులు పెంచినందుకు మంత్రి సంధ్యారాణి కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.