అరుదైన అవకాశం దక్కించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సంధ్యారాణి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి ఆమెకు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయంలో పోలీసు గౌరవవందనం స్వీకరించిన అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి ఎయిమ్స్ కి రాష్ట్రపతి వెళ్లారు. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విద్యా సంస్థ(ఎయిమ్స్) స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతికి మంత్రి సంధ్యారాణి అరకు కాఫీ మంగళగిరి చేనేత వస్త్రాలు అందించి సాదరంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతికి ఆహ్వానించే అరుదైన అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కు మంత్రి సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు. స్నాతకోత్సవం ముగిసిన తర్వాత రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లారు. తిరుగు ప్రయాణం అయిన రాష్ట్రపతికి మంత్రి సంధ్యారాణి వీడ్కోలు పలికారు.