మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశం
విజయనగరం జిల్లా ఎస్ కోట ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్యంపై మహిళ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అంబేడ్కర్, డీఎంహెచ్వో జగన్నాథరావు కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అధికారులు మంత్రికి తెలియజేశారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సంధ్యారాణి ఆదేశించారు.