మంత్రి సంధ్యారాణి కోరిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు
విజయనగరం గోష ఆసుపత్రికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శుక్రవారం విజయవాడలో వినతిపత్రం అందించారు. విద్య వైద్య సేవలు నాణ్యమైనవి అందించడమే ప్రభుత్వ ధ్యేయం కాబట్టి ఘోష ఆసుపత్రికి నిధులు మంజూరు చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి అన్నారు.