మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సాలూరు క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారినుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అరకు, పాడేరు నాయకులు వంటల నాగేశ్వరరావు, బొర్రా నాగరాజు నియోజకవర్గాల్లో గ్రామాలకు రోడ్లు మంజూరు చేయాలని కోరారు. మక్కువ మండలం చెముడు గ్రామానికి చెందిన నిరుద్యోగ మహిళలు వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. సాలూరు మున్సిపాలిటీ దండిగాం రోడ్డుకు ఇరువైపులా నివశిస్తున్న మహిళలు వచ్చి నీటి సమస్య ఉందని, పరిష్కరించాలని కోరారు. పట్టణంలోని ముస్లిం సోదరులు వారి సమస్యలను తెలియచేసారు. మంత్రి సంధ్యారాణి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ప్రాధాన్యత క్రమంలో సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.