అగ్ని గంగమ్మకు మొక్కుబడులు చెల్లింపు
సాలూరు పట్టణం పంచముఖేశ్వర స్వామి ఆలయంలో సోమవారం మహిళ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీ హోమం, పూర్ణాహుతి పూజలలో పాల్గొన్నారు. శివునికి అభిషేకాలు చేశారు. లలిత దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి అలంకరించిన చీరలను హోమగుండంలో వేసేందుకు మంత్రి చేతులమీదుగా అందజేశారు. అంతకు ముందుగా మాజీ కౌన్సిలర్ నూతి రాజేశ్వరి, శంకరరావు నివాసంలో అగ్ని గంగమ్మకు పసుపు కొమ్ముల తులాభారం సమర్పించారు. అమ్మవారికి మొక్కుబడులు సమర్పించారు. అనంతరం కామాక్షి అమ్మవారికి పూజలు చేశారు.