దాతలకు కృతజ్ఞతలు తెల్పిన మంత్రి సంధ్యారాణి
ముఖ్య మంత్రి సహాయ నిధికి సాలూరు ప్రాణదాత ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ గణేశ్వరా రావు లక్ష రూపాయల విరాళం చెక్కును మంత్రి వర్యులు గుమ్మిడి సంధ్యా రాణికి అందజేశారు. ఈ కార్యక్రమం లో ఇండుపూరి
నారాయణరావు, గంటా వెంకటరాజు,ఉప్పల వెంకటేశ్వరావు ,వడ్డాది షణ్ముఖ ముత్యాలు , వానపల్లి ఈశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. విరాళం అందించిన దాతలకు ప్రభుత్వం తరపున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.