అధికారులను ఆదేశించిన మంత్రి
పల్లె పండగ కార్యక్రమం విజయవంతం చేయాలని మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జిల్లా అధికారులకు ఆదేశించారు. సోమవారం సాయంత్రం మంత్రి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పంచాయతీల వారీగా మంజూరైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయాలని సూచించారు. ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో పల్లె పండగ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి అభివృద్ధి పనులు త్వరితగతన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు