పదిమంది నివసిస్తున్న గ్రామానికి తాగునీరు అందించాలి: మంత్రి సంధ్యారాణి

243 వసతి గృహాల్లో మరుగుదొడ్ల నిర్మాణం

ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు అభినందనలు

అన్ని శాఖల అధికారులతో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో మంత్రి సమీక్ష

పది మంది గిరిజనులు నివసిస్తున్న గ్రామానికి కూడా తాగునీటి సౌకర్యం కల్పించాలి. గిరిజనుల విద్య వైద్యం మౌలిక సదుపాయాలు కల్పనపై అధికారులు దృష్టి సారించాలి. గిరిజన ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాలలో విద్యార్థులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. అని మంత్రి సంధ్యారాణి మన్యం జిల్లా అధికారులకు ఆదేశించారు.

పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల  ముఖ్య అధికారులతో మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శనివారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మన్యంలో జిల్లా అధికారులు ప్రజా ఫిర్యాదులపై చక్కగా స్పందిస్తున్నారని అధికారులను అభినందించారు.  ప్రతి సోమవారం మండలాల్లో ఫిర్యాదు స్వీకరణ కార్యక్రమాలు నిర్వహించి,  ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకోవాలని అన్నారు.
గిరిజన ప్రాంతాల్లో ప్రధాన సమస్యలు విద్య, వైద్యం, రహదారులు, త్రాగునీరు, సాగు నీరు, వీటిపై అధికారులు దృష్టి పెట్టాలని మంత్రి  సూచించారు.
ప్రత్యేకంగా  కొండ ప్రాంతాల్లో నివసించే గ్రామాలలో కనీసం తాగు నీరుకూడా అందుబాటులో లేదు., వెంటనే నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
243 హాస్టల్స్ లో టాయిలెట్స్ నిర్మిస్తున్నాం‌.
హాస్టళ్లలో విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఒక టాయిలెట్ ఉండాలని, అలాగే వారికి ట్రంక్ పెట్టెలు, దుప్పట్లు, ఇతర నిత్యావసరాలు నేరుగా అందించాల్సిందిగా తెలిపారు. సాలూరు, కురుపాం, పాలకొండ ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. 10 ఇళ్లున్న గ్రామాలకు కూడా  నీటి సౌకర్యం ఉండేలా చూడాలని ఆదేశించారు.
ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న గిరిజనులకు ఆసుపత్రుల్లో వైద్యం అందేలా డాక్టర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండాలని, మందులు కూడా అందుబాటులో ఉంచాలని, ఎక్కడైనా మందుల కొరత లేదా బయట కొనుగోలు చేయాలని సూచిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి అన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జెసి శోభిక కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, ఐటీడీఏ పీవో శ్రీవాత్సవ్, ఐసిడిఎస్, గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *