* భోజన వంటకాలు పరిశీలించి రుచి చూసిన మంత్రి
* మెరుగైన విద్య, వైద్యం అందిస్తామని భరోసా..
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొత్తవలస గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి.
నేరుగా వంట గదికి వెళ్లి భోజన వంటకాలను పరిశీలించి తిని రుచి చూశారు. ఎంతమంది విద్యార్థులకు వంటలు చేశారని మంత్రి అడగగా 630 మంది విద్యార్థులకు 70 కిలోల చికెన్ వండినట్లు సంధ్యారాణి కి తెలిపారు. టబ్బు తెరిచి చూసిన మంత్రి ఇది 70 కిలోలు ఉంటుందా.. అని అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు. పోషకాహారం పెట్టడంలో లోపాలు సరి చేసుకోవాలన్నారు. ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాలలో మెను తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని ఆదేశించారు.
అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలు ఏమైనా ఉంటే బాక్స్ లో లెటర్ రాసి వేయాలని చెప్పారు. హెచ్ ఎం, వార్డెన్, ఉపాధ్యాయులకు చెప్పకుండా బయటకు వెళ్లొద్దన్నారు. విద్య, విద్యార్థుల ఆరోగ్యం ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఉపాధ్యాయులకు సూచించారు. మెనూ చార్ట్ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. విద్యార్థులతో చదివించి తప్పులను సవరించి విద్యార్థులకు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షులు పరమేష్, జి. వేణు, యుగంధర్, కనక, భాస్కర రావు, శ్రీను, గణపతి తదితరులు పాల్గొన్నారు.