ప్రజా సమస్యల స్వీకరించినందుకు మంత్రి సంధ్యారాణి నిర్వహించిన ప్రజాదర్బారులో పలు సమస్యలు వచ్చాయి. వీటిని శాఖల వారీగా విభజించి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కు, ఆయా శాఖల మంత్రులకు అందజేశారు.
శాఖల వారీగా వచ్చిన సమస్యలపై మంత్రుల కమిటీ భేటీలో గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చర్చించారు. వెనుకబడిన గిరిజన నియోజకవర్గం అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించాలని క్యాబినెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను మంత్రి సంధ్యారాణి కోరారు. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 50 కోట్ల రూపాయల నిధులపై కూడా మంత్రి కేబినెట్లో సీఎం దృష్టికి తీసుకువెళ్లారు..