మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై గిరిజన, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఫైర్ అయ్యారు.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో విలేకరుల సమావేశంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడారు.
గతంలో మాజీ మంత్రి స్పీకర్ కోడెల శివప్రసాద్ లక్ష రూపాయలు విలువచేసే ఫర్నిచర్ ప్రభుత్వానికి అప్పగించలేదని జగన్ ప్రభుత్వం దొంగ అని ముద్రవేసింది. ఆయనను మానసిక క్షోభకు గురి చేసి జగన్ ప్రభుత్వం హత్య చేసింది. ఫర్నిచర్ తీసుకుపోవాలని రెండుసార్లు కోడెల లేఖలు రాసినప్పటికీ జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని, గత ప్రభుత్వం ఆయనపై దొంగ అని ముద్ర వేసి హత్య చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ సీఎం జగన్ చేసిన నిర్వాహకం ఏంటని ఆమె ప్రశ్నించారు. లక్షల రూపాయల విలువచేసే ఫర్నిచర్ ను జగన్ ఇంట్లో దాచుకున్నాడు మరి ఈయనను గజదొంగ అనాలా అన్నారు. జగన్ పై ఏం కేసులు పెట్టాలి, ఏం చేయాలో చెప్పాలన్నారు.