పర్యాటక ప్రాంత అభివృద్ధి కృషి
సాలూరు నియోజకవర్గం, పాచిపెంట మండలంలో పారమకొండ పై శివపార్వతుల కళ్యాణం పూజల్లో మహిళ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య స్వామి, మహాశక్తి, శ్రీచక్రం, శివలింగానికి అభిషేక పూజలు చేశారు. శివ పార్వతుల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. సనాతన ధర్మ పరిషత్ సభ్యులు, అర్చకులు మంత్రి ఆమె భర్త జయకుమార్ కు పూలమాలలు, కండువాలు వేసి ఆశీర్వచనాలు అందించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పారమ్మ కొండను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తానని అన్నారు. రహదారి అభివృద్ధి పనులతో పాటు కొండపైకి మెట్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తాం అన్నారు. ఆమె వెంట పట్టణ మండల టిడిపి నేతలు చిట్టి, పరమేశు, ఈశ్వరరావు, ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు.