పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని కామాక్షి అమ్మవారిని శనివారం గిరిజన మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆంజనేయస్వామికి ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు దేవి ఉపాసకులు ఎం సత్యనారాయణ మంత్రి సంధ్యారాణి ని ఆశీర్వదించారు. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని పాలన సుభిక్షంగా సాగుతుందని మంత్రిగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆయన ఆశీర్వచనాలు అందించారు.