ఆకట్టుకున్న మంత్రి ప్రసంగం
విజయవాడ నోవాటెల్ హోటల్ లో మానవ అక్రమ రవాణాపై జాతీయ స్థాయి సదస్సు జరిగింది. జాతీయస్థాయి సదస్సుకు హాజరైన పలువురు ప్రముఖులకు మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత యునైటెడ్ స్టేట్స్ కన్సులేట్ జనరల్ లార్సన్, ప్రజ్వల స్థాపకురాలు సునీత కృష్ణన్ కి స్వాగతం పలికి పుష్ప గుచ్చాలు అందించి అభినందించారు. కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి స్వాగత ప్రసంగం చేశారు. మానవ అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రంలో చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు హోం శాఖ మంత్రి అనిత అన్నారు. కార్యక్రమంల డిజిపి ద్వారక తిరుమల రావు , స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సూర్యకుమారి, ఐటీ సెక్రటరీ సౌరభ్ గౌర్ తదితరులు పాల్గొన్నారు.