రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శాఖలు కేటాయించిన తర్వాత రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగించాలని సంధ్యారాణికి చంద్రబాబు సూచించారు. సంధ్యారాణి తో పాటు కుమార్తె కుమారుడు ప్రణతి, పృథ్విలు ముఖ్యమంత్రికి బొకేలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.