ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తాం: మంత్రి సంధ్యారాణి

26వ వార్డు లో పింఛను పంపిణీ చేసిన మంత్రి

ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తాం. ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలో చంద్రన్న పాలన సాగుతోంది. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం 26వ వార్డు చెరువు గట్టు వీధి వెంకటేశ్వర కాలనీలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు మంత్రి అందజేశారు. చెరువుగట్టు వీధిలో పెన్షన్ దారులతో మాట్లాడారు. ఈ డబ్బులు ఎవరిస్తున్నారో మీకు తెలుసా అని మంత్రి అడగగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తున్నారని బోసి నవ్వులతో వృద్ధులు సమాధానమివ్వడంతో మంత్రి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర కాలనీలో కాలు కదపలేని వృద్ధురాలు రెడ్డి కొండమ్మకు ఇంటికి వెళ్లి పెన్షన్ అందించి ఎన్టీఆర్ భరోసాతో మీరు ఆనందంగా ఉండండి అని మంత్రి చెప్పారు. పెన్సన్ పంపిణీకి వీధుల్లో కి వచ్చిన మంత్రికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలవర్షం కురిపిస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో పట్టణ కూటమి‌ నాయకులు‌ చిట్టి, శివకృష్ణ, విశ్వేశ్వరరావు, కేతిరెడ్డి చంద్ర, టిడిపి కౌన్సిలర్లు ,కమిషనర్ సత్యనారాయణ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పింఛను డబ్బులు అందించి వృద్ధులకు నమస్కరిస్తున్న మంత్రి సంధ్యారాణి
వెంకటేశ్వర కాలనీలో కూటమినేతలతో..

పింఛనుదారుతో మాట్లాడుతున్న మంత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *