మంత్రి నారా లోకేష్ ను కోరిన విజయనగరం ఎంపీ
ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ను విజయవాడ లో వారి నివాసంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి. అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు . ఈ సందర్భంగా లోకేష్ తో నియోజకవర్గాలలో పలు సమస్యలపై ఎంపీ చర్చించారు. గత ప్రభుత్వంలో విలీనం చేసిన ఎలిమెంటరీ పాఠశాలలను పునః ప్రారంభించాలని కోరారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని స్కూళ్లు శిథిలావస్థకు చేరాయి. వాటికి ప్రత్యామ్నాయం చూపాలని, ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కోరినట్లు ఎంపీ తెలిపారు.