ఎంపీకి ప్రసాదం తినిపించిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు
విజయనగరం పైడితల్లి అమ్మవారిని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఆలయానికి వచ్చిన ఎంపీని అర్చకులు దేవాదాయశాఖ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సినిమానోత్సవం లో పాల్గొన్నారు. ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఎంపీ మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో భక్తులను అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం వరుసలో నిలుచున్న వారికి మజ్జిగ, నీరు ఎంపీ చేతుల మీదుగా అందజేశారు. అమ్మవారి ప్రసాదాన్ని కేంద్ర మాజీ మంత్రివర్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు ఎంపీకి తినిపించారు. ఇది జీవితంలో మరపురాని మరచిపోని మధుర స్మృతి అని ఎంపీ ఆనందం వ్యక్తం చేశారు.