పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో చర్చించాల్సిన అంశాలపై చర్చ
ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ
పార్లమెంట్ సీతాకాల సమావేశాలలో చర్చించాల్సిన పలు అంశాలపై మాజీ కేంద్ర మంత్రివర్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరం పార్లమెంట్ సభ్యులు, ఐ.టీ & కమ్యూనికేషన్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడుకి దిశ నిర్దేశం చేసి పలు సలహాలు సూచనలు అందించారు. విజయనగరం అశోక్ బంగ్లాలో ఎంపీ మర్యాద పూర్వకంగా కలిశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చించాల్సిన పలు అంశాలపై ఎంపీ కలిశెట్టితో అశోక్ గజపతి రాజు చర్చించారు.
ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజుకు జన్మదిన శుభాకాంక్షలు
విజయనగరం అశోక్ బంగ్లాలో జరిగిన విజయనగరం నియోజకవర్గ శాసన సభ్యురాలు పూసపాటి అధితి గజపతిరాజు జన్మదిన వేడుకలలో ఎంపీ పాల్గొన్నారు. ఆమెకు నోట్ బుక్స్ అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.