అండమాన్ నికోబార్ దీవుల్లో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు వెళ్లారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని తెలుగుదేశం పార్టీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. మాణిక్యరావు యాదవ్ ఎంపీ కలిశెట్టిని ఆహ్వానించారు. తెలుగువారు ఆన్‌లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవడం, వారికి పార్టీ యొక్క ఆదరణ లభించడం వారిలో ఉన్నటువంటి సాంకేతిక సామర్థ్యాలను మరింత ప్రోత్సహించే చర్యగా నిలుస్తుందని కలిశెట్టి అన్నారు.