పార్వతీపురం మన్యం జిల్లా
సాలూరు మెంటాడ వీధిలో రామమందిరం వద్ద శుక్రవారం సీతారాముల కళ్యాణానికి మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ముహూర్తపు రాట వేశారు.
ఈనెల 17న శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు.
ముహూర్తపు రాట ను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.