దసరా దీపావళి పండగలకు కూడా జీతాలు చెల్లించకుండా మున్సిపల్ కార్మికులను ఆకలి దప్పులతో పాలకులు ఉంచుతున్నారని నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం పట్టణ జాతీయ రహదారిపై పారిశుద్ధ్య కార్మికులు ఆకలియాత్ర (ర్యాలీ) చేశారు. యాత్రను ఉద్దేశించి సిఐటియు నేత ఎన్ వై నాయుడు మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులకు వేతనాలు చెల్లించకుండా అధికారులు పాలకవర్గం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కనీసం క్రిస్మస్ సంక్రాంతి పండుగలు నాటికైనా వేతనాలు చెల్లించి కార్మికుల ఆకలి తీర్చాలని డిమాండ్ చేశారు. యాత్రలో శంకర్, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.