పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. పట్టణ ప్రధాన రహదారి పక్కన విజయదుర్గ మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నవ దుర్గలకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. కార్మికులంతా మంత్రి సంధ్యారాణికి పసుపు కుంకుమ వస్త్రాలు, ప్రసాదం సమర్పించారు. తోబుట్టువుగా ఆదరించిన కార్మిక సోదరులు అందరకీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పుజా కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు నిమ్మాది చిట్టి, శోభారాణి. వైదేహి, అప్పయ్యమ్మ, అన్నపూర్ణ, బాల, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.