పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

ఈనెల 3 నుంచి 12వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ   పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి.

ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అదేవిధంగా రాత్రి 7 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 12వ తేదీ విజయదశమినాడు రాత్రి 7:45 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు విశేషమైన గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

న‌వ‌రాత్రి ఉత్స‌వాల కార‌ణంగా ఈ 10 రోజుల పాటు క‌ల్యాణోత్స‌వం సేవను ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది. అదేవిధంగా, అక్టోబరు 4, 11వ తేదీలలో ల‌క్ష్మీపూజ‌, అక్టోబరు 12న ఊంజల సేవలను టీటీడీ రద్దు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *