విజయనగరం జిల్లా మెంటాడ మండలం మీసాలపేట గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా దంపతులు విద్యుత్ షాక్ తో మృతి చెందారు.
మీసాల పేట గ్రామానికి చెంది కోరాడ ఈశ్వరరావు, ఆదిలక్ష్మి దంపతులు గ్రామ సమీపంలో ఉన్న తమ పొలంకు చెరువు నీటిని మళ్లించేందుకు శుక్రవారం ఉదయం వెళ్లాగా పొలంలో క్రిందపడి ఉన్న విద్యుత్ వైర్లను ఈశ్వరరావు కాలికి తగలడం వలన షాక్ గురై అక్కడికి ఆక్కడే మృతి చెందగా
పొలంకు వెళ్లిన భర్త ఇంటికి రాకపోవడంతో అతని కోసం భార్య ఆదిలక్ష్మి పొలం కి వెళ్లి చూడగా అక్కడ పొలంలో భర్త పడి ఉండడాన్ని గమనించి అతనిని పైకి లేపే ప్రయత్నం చేయగా ఆమె కూడా విద్యుత్ షాక్ గురై మృతి చెందింది.విద్యుత్ వైర్లు గత నెల 14వ తేదీన స్తంభాలు విరిగి విద్యుత్ వైర్లు పొలంలో పడి ఉన్నాయని లైన్మెన్ కు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
విద్యుత్ వైర్లు గత నెల 14వ తేదీన స్తంభాలు విరిగి విద్యుత్ వైర్లు పొలంలో పడి ఉన్నాయని లైన్మెన్ కు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
విద్యుత్ శాఖ అధికారులు వచ్చి న్యాయం చేసే వరకు మృతదేహాల్ని తరలించేది లేదని స్పష్టం చేశారు
విషయం తెలుసుకున్న ఆండ్ర ఎస్సై దేవి ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.