పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పి. కోనవలస చెక్ పోస్ట్ వద్ద పశువులు అక్రమంగా తరలిస్తున్న మూడు కంటైనర్ వాహనాలను పాచిపెంట ఎస్సై కె.వి సురేష్ కుమార్ సీజ్ చేశారు. చెక్ పోస్ట్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిస్సా నుంచి వస్తున్న మూడు కంటైనర్ లారీలను ఆపి తనిఖీ చేశారు. వాటిలో పశువులను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే వాహనాలను సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ తెలిపారు. పశువులను గోశాలకు తరలించాం అన్నారు.