పాచిపెంట మండలం చాపరాయివలస సమీపంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి నుంచి పది కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని పాచిపెంట ఎస్సై కేవీ సురేష్ కుమార్ తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు చాప రాయవలస వద్ద తనిఖీలు నిర్వహించారు. రెండు బ్యాగులతో ఇద్దరు అనుమానిత వ్యక్తులు సంచరిస్తుండడం గమనించారు. సూరజ్ బాన్ ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తిగా, రెండవ వ్యక్తి జితేంద్ర రాజు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఒడిస్సా పాడువా లో గంజాయిని నరేంద్ర సింగ్ అనే వ్యక్తి వద్ద నుండి కొనుగోలు చేసి మహారాష్ట్రలో ఎక్కువ ధరకు అమ్ముటకు గాను తీసుకొని వెళుతున్నట్టు తెలియజేశారని ఎస్ ఐ చెప్పారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా రిమాండ్ విధించినట్లు తెలిపారు.