అభివృద్ధి పనికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ యుగంధర్
పాచిపెంట మండలం పాంచాలి గ్రామంలో అధికారులు పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీ సర్పంచ్ గూడేపు యుగంధర్ గ్రామానికి మంజూరైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన పూజలు చేశారు. వారం రోజులపాటు పల్లె పండగ నిర్వహిస్తాం అని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.