బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన
పల్లెల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం అని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే. రంగారావు (బేబీ నాయన) అన్నారు. రామభద్రపురం మండలం తారాపురం గ్రామంలో ఎమ్మెల్యే పల్లె పండగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తుందన్నారు. రామభద్రపురం మండలంలో గ్రామాల అభివృద్ధికి రూ.5.13 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి చింతల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు మడక తిరుపతిరావు, మండల టీడీపీ అధ్యక్షులు కరణం భాస్కరరావు, తారాపురం సర్పంచ్ బెవర రవణమ్మ, ఎంపీటీసీ బెవర సునీత, సర్పంచ్ ప్రతినిధి బెవర సీతారాం, వైస్ సర్పంచ్ పొట్టంగి సీతారాం, మాజీ ప్రెసిడెంట్ కాశమ్మ, వార్డు మెంబర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.