సాలూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప్తి
వైకాపాలో గుర్తింపు లేక జనసేన పార్టీలో చేరినట్లు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ జరజాపు దీప్తి అన్నారు. విశాఖపట్నంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ సమక్షంలో ఆమె, మాజీ మున్సిపల్ చైర్మన్ జె. ఈశ్వరరావు, పట్టణ వైకాపా మాజీ అధ్యక్షులు జరజాపు సూరిబాబు, కౌన్సిలర్లు రాపాక మాధవరావు, గొల్లపల్లి వరప్రసాద్, పప్పల లక్ష్మణ, లింగాల దుర్గ, సింహాచలం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం వైస్ చైర్పర్సన్ దీప్తి మాట్లాడుతూ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి జేబీఎస్ సోదరులు ఎంతో శ్రమించారని అన్నారు. పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడంతో వైకాపాను వీడినట్లు చెప్పారు. నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేయడమే ధ్యేయంగా పనిచేస్తామని శివశంకర్ కు ఆమె మాటిచ్చారు.