పల్లె పండగతో అభివృద్ధి బాటలు

గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

వంద రోజుల్లో అభివృద్ధి  చేసి చూపించాం

పాచిపెంటను పసిడిపంటగా మారుద్దాం

కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో.. పల్లెపండగ కార్యక్రమం నిర్వహించిన 100 రోజుల్లో.. అభివృద్ధి  చేసి చూపించమని మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం
సాలూరు నియోజకవర్గంలో 100 రోజుల్లో 100 సీసీ రోడ్లు ప్రారంభోత్సవం మంచాడవలస పంచాయితీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు.
ఇది మంచి ప్రభుత్వం – కూటమి ప్రభుత్వం – చంద్రన్న ప్రభుత్వం మా సంధ్యమ్మ నాయకత్వంలోనే సాధ్యం అని ప్రజలు ఆనందంతో స్వాగతం పలికారు.
రూ.11 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించి శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..
గ్రామసభలలో పల్లె పండుగ కార్యక్రమాలు జరిగిన 100 రోజుల్లో 100 సీసీ రోడ్లు నిర్మించాం అన్నారు.
ఎక్కడైనా రోడ్లపై గుంతలు చూశాం కానీ గత ప్రభుత్వంలో గుంతల్లో రోడ్లు ఉండేవి అని మంత్రి ఎద్దేవా చేశారు.
సాలూరు నియోజకవర్గంలో 100 సీసీ రోడ్లలో 5 కోట్ల వ్యయంతో మక్కువ మండలంలో 35, సాలూరు మండలంలో 22, పాచిపెంట మండలంలో 27, మెంటాడ మండలంలో 20 నాణ్యమైన సీసీ రోడ్లు పూర్తిచేసుకున్నాం అని మంత్రి సంధ్యారాణి చెప్పారు.
పాచిపెంట మండలం బిటి రోడ్లు నిమిత్తం 3 కోట్లు మంజూరు చేయించడం జరిగిందని మంత్రి తెలిపారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు వైసిపి నేతలు అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకొనే ప్రసక్తి లేదని మంత్రి సంధ్యారాణి హెచ్చరించారు.
ఎన్నికలలో విజయం అందించిన నాప్రజలకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేస్తాను అని మంత్రి పేర్కొన్నారు.
పాచిపెంట పేరుని పసిడి పంటగా మారుద్దామని మంత్రి సూచించారు.
అడిగిన వెంటనే సాలూరు నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం మండల టిడిపి అధ్యక్షుడు ప్రసాద్ బాబు, రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ, సురేష్ కనకారావు, సర్పంచ్ పార్వతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *