హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా విజయనగరం జిల్లా గరివిడి మండలం అర్తమూరు గ్రామానికి చెందిన పతివాడ రామకృష్ణ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రామకృష్ణ బిఏ చదివి, మహారాజా లా కళాశాలలో 2003లో ఎల్.ఎల్.బి పూర్తి చేశారు. అనంతరం ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. వృత్తిపరంగా చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకంపై న్యాయవాదులు, మిత్రులు లక్కోజు శ్రీనివాస్, అప్పారావు, నర్సింగరావు, పద్మ, సురేష్ వెంకటేష్, భాస్కర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.