పట్టణంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో భూనీల సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి పవిత్రోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు నారాయణచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రమా సత్యనారాయణ స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.