మంత్రి సంధ్యారాణి చొరవతో మంజూరైన బ్రిడ్జ్
తీరనున్న గిరిజన గర్భిణుల కష్టాలు
హర్షం వ్యక్తం చేసిన గిరిజనులు
అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరికొండలో గత వారం
బాలింతను ఆస్పత్రికి తీసుకువెళ్ళేందుకు అవస్థలు పడిన కుటుంబ సభ్యులు. ప్రమాదకర పరిస్థితుల్లో బాలింతను భుజంపై మోసి, పెద్దేరువాగు దాటించిన కుటుంబ సభ్యులు.
ఈ ఘటన మీడియాలో వైరల్ కావడంతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో మంత్రి సంధ్యారాణి మాట్లాడారు.
వాగు దాటేందుకు బాలింతలు, ప్రజలు పడుతున్న కష్టాలను చూసి, గిరిజనులు చెప్పింది విని చలించిపోయారు. వాగు దాటేందుకు.. రోప్ వే బ్రిడ్జి నిర్మాణానికి రూ. 70 లక్షలతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిధులు కేటాయిస్తాం వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించిన మంత్రి సంధ్యారాణి. రోప్ వే బ్రిడ్జి మంజూరు కావడంతో గిరిజనులు, పరిసర ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.