విజయనగరం జిల్లా పోలీసు
రచనలతో వాడుక భాషకు వన్నె తెచ్చిన కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు – అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్
కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతిని జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో మార్చి 13న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ శ్రీమతి అస్మా ఫర్హీన్ ముఖ్య అతిథిగా హాజరై, కవయిత్రి మొల్లమాంబ చిత్ర పటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అదనపు అస్మా ఫర్హీన్ మాట్లాడుతూ – 16వ శతాబ్ధానికి చెందిన ఆతుకూరి మొల్లమాంబ తెలుగు కవయిత్రిగా కీర్తి గడించారన్నారు. వాజ్మయ మూలాలు ఆధారంగా కవయిత్రి స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తని, ఆమె సరళమైన వాడుక భాషలో సామాన్యులకు కూడా అర్ధమయ్యే శైలిలో రచనలు చేసారన్నారు. సంస్కృత భాషలోని రామాయణాన్ని ప్రప్రధమంగా తెలుగులోకి అనువదించి మహిళగా మొల్లమాంబ ఘనత వహించారన్నారు. మొల్లమాంబ రచించిన మొల్ల రామాయణంలో ఆరు కాండాలు, 871 పద్యాలు ఉండగా, వీటిని కవయిత్రి మొల్లమాంబ కేవలం 5 రోజుల్లోనే రాసినట్లుగా ప్రతీతి చెందారన్నారు. అటువంటి మహనీయురాలైన కవయిత్రి మొల్లమాంబను ఆమె జయంతి రోజున స్మరించుకోవాల్సిన మనందరిపైనా ఉందని అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ అన్నారు. ఈ సందర్భంగా మొల్లమాంబ చిత్ర పటానికి పోలీసు అధికారులు పూలమాలలు వేసి, పుష్పాలు సమర్పించి, నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, డిసిఆర్బి సిఐ జె.మురళి, రిజర్వు ఇన్స్పెక్టరు టి.శ్రీనివాసరావు, డిపిఓ పర్యవేక్షకులు ప్రభాకరరావు, డిసిఆర్బి ఎస్ఐ గణేష్, డిటిఆర్బి ఎస్ఐ ప్రభావితి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొని, మొల్లమాంబ చిత్ర పటానికి పుష్పాలు సమరించి, నివాళులు అర్పించారు.