పోలీస్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, అలాగే చెక్ పోస్ట్ లను పటిష్టం చేసే క్రమంలో సాలూరు రూరల్, పట్టణ సిఐలు రామకృష్ణ, అప్పలనాయుడు ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. పాచిపెంట మండలం పి.కోన వలస చెక్పోస్ట్ వద్ద తర్ఫీదు పొందిన డాగ్స్ డ్రోన్ కెమెరాలతో పోలీసులు మాక్ డ్రిల్ చేపట్టారు. అలాగే పట్టణ పోలీసులు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద శిక్షణ పొందిన డాగ్స్ తో ప్రయాణికుల బ్యాగులు తనిఖీ చేశారు. పలు ప్రాంతాలలో జరుగుతున్న విషయాలను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. డాగ్స్ డ్రోన్ కెమెరాలు పోలీసులు హడావిడి చూసిన ప్రజలు అక్కడ ఏం జరిగిందో అని ఎంతో ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో పాచిపెంట ఎస్సై కేవీ సురేష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.