650 మందికి వైద్య పరీక్షలు ఉచితంగా మందుల పంపిణీ
పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం డికె పట్నం గ్రామ సచివాలయ ఆవరణంలో పార్వతీపురం లయిన్స్ క్లబ్, ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు, శ్రీకాకుళం రాజోలు జెమ్స్ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్వతీపురం లయిన్స్ క్లబ్ అధ్యక్షులు బి.ఎన్.బి రావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న నిరు పేద గిరిజన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఈ మెగా మెడికల్ క్యాంపు ను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రోజు 650 మంది రోగులకు ఉచితంగా వైద్యం అందించడం జరిగిందని ఆయన అన్నారు. గుండె జబ్బులు, జనరల్ మెడిసిన్, చర్మ వ్యాధులు, ఎముకల వైద్యులు, ఆయుర్వేదం, కంటి వైద్యులు, స్త్రీల సమస్యలు, ఊపిరితిత్తుల వైద్యులు,గ్యాస్ట్రో వైద్యులు, ఎముకల వైద్యులు,ఆయుర్వేద వైద్యులు పాల్గొన్నారని , ఉచితంగా వైద్య సేవలు అందించి, సుమారు లక్ష రూపాయల పైచిలుకు మందుల కూడా ఉచితంగా పంపిణీ చేశారు.. అదేవిధంగా గుండె జబ్బులకు సంబంధించి 2D ఎకో స్కేన్, ఇసిజి , షుగర్, మలేరియా వంటి అనేక పరీక్షలు ఉచితంగా చేసినట్లు తెలిపారు. ఈ మెగా మెడికల్ క్యాంపులో ముఖ్య అతిథులుగా లయన్ సభ్యులు డాక్టర్ డి రామ్మోహన్ రావు, డాక్టర్ యాళ్ల వివేక్, కమిటీ ఛైర్మన్ డాక్టర్ వాసుదేవ రావు, కోఆర్డినేటర్ డాక్టర్ నల్ల దుర్గాప్రసాద్ , డాక్టర్ శ్రీరేఖ , డాక్టర్ మంచుపల్లి శ్రీరాములు, కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి వాగ్దేవి , డెంటిస్ట్ పి వసంతకుమార్ పాల్గొని వైద్య సేవలు అందించారు.
రాగోలు జెమ్స్ హాస్పటల్ నుంచి వైద్యులువచ్చి , పరీక్షలు చేసి మందులు ఉచితంగా పంచారు. మెడికల్ క్యాంపు కు వచ్చిన ప్రజలకు ఉచితంగా మందులతో పాటు ఆహారాన్ని అందించారు . అనంతరం డికె పట్నం గ్రామ సచివాలయ ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయిన్స్ క్లబ్ సెక్రటరీ లయన్ పసుమర్తి శివ ప్రసాద్, ట్రెజరర్ లయన్ బివిఎస్ నాయుడు, లయన్స్ సభ్యులు, రెడ్ క్రాస్ సభ్యులు, స్వచ్ఛంద సేవా సంస్థ జెకెఎస్ సభ్యులు , DK పట్టణం లో గల పెద్దలు, యువత పాల్గొని సేవలు అందించారు.
జిల్లా నాయకుడు గొట్టాపు వెంకటనాయుడు , పరిసర గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.